Saturday, July 3, 2010

'మా' ముళ్ళపూడి

తెలుగు సీమలో హాస్యాన్ని పండించిన హాలికుడు - మా ముళ్ళపూడి

తెలుగు పదాలకు కొత్త అర్థాలు నేర్పించిన బడి

తెలుగు వారి గుండెల్లో కట్టాడు నవ్వుల గుడి

వండి వడ్డించిన ప్రతి రచనా వేడి వేడి పకోడి


తెలుగు పిల్లలకు అల్లరి నేర్పిన బుడుగు

నవ్వలేని రోగుల్ని మసి చేసే హాస్యపు పిడుగు

మధ్యతరగతి జీవితాలకు పట్టిన గొడుగు

తెలుగు సాహితీ పథంలో హాస్యం కోసం వేసిన తొలి అడుగు


రాథా గోపాలం సంసారపు ముద్దు ముచ్చట్లు

అప్పుల కోసం అప్పారావు పడే ఇక్కట్లూ

ఇద్దరమ్మాయిలతో ముగ్గురబ్బాయిలు పాడే డ్యూయెట్లు

ఎన్ని మార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చాక్లెట్లు


ముని వాకిట్లో ముగ్గులేసి ప్రేమ ముగ్గులో దింపే రెంజెళ్ళ సీతలు

చిరు చీకట్లో ఆ ముక్కు(గ్గు)ల మీద తిమ్మనల్లా కవిత లల్లే బాబాయిలు

లక్షొత్తుల నోములతో అనుబంధాలను ఒత్తే బామ్మలు

ఒత్తుల డబ్బాలోంచి చిల్లర కాజేసే బుడుగులాంటి మనవలు

యములాళ్ళ లాంటి ఆఫీసర్లు, సుబ్బారావు మామగార్లూ

లావుపాటి పక్కింటి పిన్నిగార్లూ, ఆరళ్ళు పెట్టే అత్తగార్లు

ఇలా మన చుట్టూ ఉన్న మనుషులే ఈ కథల్లోని పాత్రలు

రమణీయుడి హాస్యపు కుంచె తో వన్నెలద్దుకున్న జీవ చిత్రాలు


స్వచ్ఛమైన హాస్యానికి కేరాఫెడ్రస్ మా ముళ్ళపూడి

తెలుగువారిని నవ్వించడంలో అతన్ని మించిన వాడేడీ...??

1 comment:

  1. ముళ్ళపూడిపై మీ అభిమానం చక్కగా అక్షరీకరించారు. అయితే.. ‘తెలుగు సాహితీ పథంలో హాస్యం కోసం వేసిన తొలి అడుగు’ అనకుండా ఉండాల్సింది. ముళ్ళపూడికే అమితంగా నచ్చిన భమిడిపాటి లేడూ? మునిమాణిక్యం, మొక్కపాటిల సంగతి?

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails