కొత్తమిత్రుల మోజులో పడి
ఇంటికి ఆలస్యంగా వచ్చినా
కించిత్తయినా కినుక వహించక
అనురాగ వర్షం కురిపించేది
ప్రేమగా భుజం మీద తలవాల్చేది
ఆవురావురు మంటూ అన్నం తింటున్పప్పుడు
ఆప్యాయంగా నవ్వి
ముగ్గురు పిల్లలకూ ముత్యమంత ముద్దలు పెట్టి
మొగుడికి ముత్యమంత ముద్దిచ్చేది
కడుపు నిండిన నేను ఖుషీగా
కూనిరాగం తీస్తుంటే
నా కరకు గొంతుకతో జత కలిపి
నా ఖూనీ రాగానికి అవ్యక్త మాధుర్యాన్నద్దేది
యవ్వనపు సిరితో నేను
అద్దంలో అందాలు ఆరబోసుకుంటున్నప్పుడు
చెంత చేరి నా సొగసులో సగమైనా నీకేదీ
అంటూ వాలుకళ్ళార్పుతూ సవాలు చేసేది
పరీక్షా సమయంలో పుస్తకాలతో కూస్తీపడుతూ
ఆవులింతలతో దోస్తీ చేస్తున్నప్పుడు
గాంభీర్యం కలిసిన మృదువైన గొంతుకతో
సందడి చేస్తూ (అదిలిస్తూ) మేల్కొలిపేది
తొలి ఉషతో సుప్రభాతం పాడి
మధ్యాహ్నాల్లో మంతనాలాడి
మలి ఉషతో వీడ్కోలు వేడి
అన్నిటా తోడై నిలిచేది.
కలకల్లాడుతూ కమ్మనికలలా సాగుతున్న
నేస్తం బంగారు కాపురంలో
కిట్టని కఠినాత్ములు నిప్పుల వర్షం కురిపించారు.
రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలెగిరిపోయారు
తాకితే ఛస్తావని ఫాను ముని ఇచ్చిన శాపం
దాని మొగుడు యక్షుడికి ఉరిలా బిగిసింది.
నా నేస్తం కలలగూడు చెదిరింది
విభుడి కోసం వగచి వగచి గుండె పగిలింది
ఒంటరి నక్షత్రంలా నా నేస్తం మిగిలింది
నా కన్నీరు కాలువలై పారింది
నాకు నీవు నీకు నేనని జాలి జాలిగా
నా గొంతు వణికింది
పదేళ్ళ కాలం కత్తుల వంతెన మీద సాగింది
కాలనాగు పడగవిప్పి మా స్నేహాన్ని కాటేసింది
కాలుష్యమనే డేగ నా నేస్తాన్ని
వాడిగోళ్ళ మధ్య తన్నుకుపోయింది
కాలమనే క్రూరాక్షసి
నా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసింది
నా గదిలో ఆ మూల
గూడు చెదిరిపోయింది
నా హృదిలో ఈ మూల
గూడు పట్టు జారింది
సిమెంటు చెట్లు మొలచిన
కార్పరేట్ కీకారణ్యంలో
కన్నీరైనా పుట్టని కఠినాత్ముల కాలుష్యపు టెడారిలో
మీకెవరికైనా
గూడు కోసం
గుప్పెడు గింజల కోసం
గుక్కెడు నీటికోసం
రెక్కలీడ్చుకుంటూ ఎగిరే నా గువ్వ కనిపిస్తే
ఈ నా పిచ్చుక సందేశం వినిపించండి
దానికోసం ( నా నేస్తంకోసం)
నా గుండె గూడు పదిలపరిచే ఉంచానని
నా ప్రేమ గింజలతోను
కన్నీటి జడులతోనూ
నా చిరకాలపు నేస్తపు
దుఃఖార్తినీ
క్షుధార్తినీ
దాహార్తినీ తీరుస్తానని
నా గుప్పెడు గుండె లో
గువ్వపిట్టగా ఒదిగి పొమ్మని.
బాగుందండీ..
ReplyDeleteగుండె చెమర్చేలా రాశారు
ReplyDeleteవిసర్గ (ఉదా: దుఃఖం) రావాలంటే @h అని టైపు చెయ్యాలి.
nice :-)
ReplyDeleteTouching!
ReplyDeleteలేత అరిటాకు దొప్ప మీద వెన్నెల ప్రసరించి నట్టు తళుక్ మనాలి కవిత్వం అనే వారు మా గురు దేవులు మానా ప్రగడ శేషశాయిగారు. అలా ఉందండీ మీ కవిత. మీ కలం భాషించే కమ్మని టపాల కోసం ఎదురు చూస్తాం. ఆశీస్సులు.
ReplyDeletehi Radha,
ReplyDeletebeautiful poetry
రాధగారూ
ReplyDeleteమీ కవిత చాలా బాగుందండీ!
నేనెలా చూడడం మిస్సయ్యానా అని....
నేను క్రితం వారం ముంబాయ్ లో Sion ప్రాంతంలో పిచ్చుకలను చూసాను!!
థాంక్ గాడ్ ఇవి ఇంకా భూమిమీద బ్రతికే ఉన్నాయన్నమాట!
Beautiful..
ReplyDelete