Tuesday, August 24, 2010

ఆ రోజు...



వారంలో ఏడో రోజు
సాయంత్రం ఏడో గంట
లేజర్ షోలో ఏడో రంగు

ఒక్క క్షణం ఆగింది
మరుక్షణం బాంబై పేలింది
పచ్చటి నేలతల్లి
నెత్తుటి చీరను కట్టింది

అహింసో పరమోధర్మమంటూ చాటే
తథాగతుని కంఠం వణికింది
హింసకు సాక్షిగా నిలిచిన నిలువెత్తు
విగ్రహం సిగ్గుతో తల వంచింది


కూల్ డ్రింక్ సీసా పై నెత్తుటి మరకలు
ఐస్ క్రీం కప్ లో మాంసపు తునకలు
అమాయక జీవులపై దానవత్వపు ఘాతుకాలు
అణువంతైనా దయలేని భగవంతుడి శాపాలు

మానవత్వమే లేని (అ)మానవుడా!!
శిలా రూపంలో నిలిచిన భగవంతుడా!!

ఒక్కసారి మీరు కూడా మనుషులు కండి
నిలువునా మానవత్వాన్ని నింపుకోండి
గాలిలో కలిసిన ప్రాణాల కోసం
గాయపడిన ప్రాణుల కోసం
మాలా వెక్కి వెక్కి ఏడవండి......

(ఆగష్టు 25,2007 లుంబిని పార్క్, గోకుల్ చాట్ జంట బాంబు పేలుళ్ళు జరిగి మూడు సంవత్సరాలు.బాధితులకు కన్నీటి నివాళులు అర్పిస్తూ...)

3 comments:

  1. గుర్తుచేసినందుకు ధన్యవాదాలండీ. అనుకున్నదంతా అయ్యింది - కేవలం ౩ ఏళ్ళల్లో ఈ దురదృష్టకర సంఘటను మరిచిపోయానండీ. "public memory is short" అని నాలాంటి వారి వలననేమో :-(

    నా మిత్రుడిదో, నాదో అదృష్టంకొద్దీ మధ్యాహ్నం ఎక్కువ నిద్రపోవడంతో లుంబినీ పార్కు-సినిమా ప్లాను తప్పిపోయిందండి. పాపం మరణించినవారు, గాయపడినవారు, వారి సన్నిహితులు.

    ReplyDelete
  2. కంట నీరు తెప్పించారు కలభాషిణి గారు. ఇంకా కళ్ళముందు కదలాడతునే ఉన్నాయి ఆ దృశ్యాలు. ఎలా మరచి పోగలము.

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails