Tuesday, March 8, 2011

నాణానికి అటూ - ఇటూ




ప్రకృతివి నీవు

పురుషాహంకార సమాజానికి నిలువెత్తు ఆకృతివి నీవు

వెలిగే చుక్కవు నీవు
స్వేచ్ఛ అనే రెక్కలు తెగిన పక్షివి నీవు

సృష్టికి మూలం నీవు        
నీ అస్తిత్వాన్ని చాటితే గర్భంలోనే లయించే పిండం నీవు

ఆకాశంలో సగం నీవు
శూన్యంలో సగాన్ని పొంది శూన్యంగానే మిగిలిపోయే జీవివి నీవు

మమతలు పంచే అమ్మవు నీవు
అంగట్లో అమ్ముడు పోయే అందాల బొమ్మవు నీవు

తరాల నడుమ వారధి నీవు
తరతరాలుగా కన్నీళ్ళు కార్చినా ఎండిపోని అంబుధి నీవు.

2 comments:

  1. బాగుంది.

    ReplyDelete
  2. తనొక్కటై...తనొంటరిగా...
    తనవాడికి తను...విచ్చి..
    తన బిడ్డకి...చను..విచ్చి...
    తనవారికి అభయమిస్తూ...
    అవమానాలు భరిస్తూ....
    ప్రేమతో...అందర్ని జయిస్తూ
    ఓర్పుతో అందర్నీ ఆకట్టుకుంటూ..
    ఇవ్వటమే తప్ప
    అడగటం తెలీని
    అమ్మకి...
    పురుషునిలో సగమైన..
    ఆది శక్తికి...
    మహి’అంతటి..ఓర్పు కలిగిన మహిళకి.
    స్త్రీశక్తికి....వందనాలు.

    చాలా బాగుంది..రాణిగారు.

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails